1 September, 2026 | 2:27 AM

లక్షల్లో అప్పులు.. రాత్రికి రాత్రే పరార్!

01-09-2026 01:42 AM
  1. కిరాణా దుకాణం ముసుగులో పరిచయాలు
  2. రూ.కోట్లలో వసూలు చేసిన దంపతులు 
  3. పాపన్నపేట మండలంలో వెలుగు చూసిన ఉదంతం

పాపన్నపేట, ఆగస్టు31(విజయక్రాంతి): చిరు వ్యాపారం పేరుతో పల్లెలో అడుగుపె ట్టి.. కలుపుగోలుతనంతో అందరి నమ్మకాన్ని చూరగొని.. చివరకు అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని భారీ మొత్తంలో అప్పులు తీ సుకుని కనిపించకుండా పోయారన్న ఆరోపణలు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లో కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన బండ గౌతమ్, బండ ప్రవళిక అనే వైశ్య దంపతులు 2022లో చిత్రి యాల శివారులోని ఏనె ప్రాంతానికి వచ్చి కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకున్నట్లు స మాచారం.

వ్యాపారం నిర్వహిస్తూ స్థానికులతో సన్నిహితంగా మెలుగుతూ, అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచి పరిచయా లు పెంచుకున్నారని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల నమ్మకాన్ని సంపాదించిన అనంతరం గృహ నిర్మాణం కోసం భూమి కొనుగోలు చేశారని, వ్యాపారంతో పాటు ఇంటి నిర్మాణానికి డబ్బులు అవసరమవుతున్నాయని పలువురిని కోరినట్లు బాధితు లు ఆరోపిస్తున్నారు. పరిచయం ఉన్న వ్యక్తు ల వద్ద నుంచి లక్షల రూపాయల చొప్పున అప్పులు తీసుకున్నారని,

ఇలా పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు సమీకరించినట్లు బాధితులు చెబుతున్నారు. ఎప్పటి లాగే ఉంటారనుకున్న దంపతులు ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఫోన్లు స్పందించకపోవడం, ఆచూకీ తెలియకపోవడంతో తమ డబ్బులు ఏమవుతాయోనని బాధితులు ఆం దోళన చెందుతున్నారు. దంపతుల ఆచూకీ కోసం బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.