22 April, 2026 | 2:57 AM

ఘనంగా డీసీసీ అధ్యక్షులు నూతి పుట్టినరోజు

22-04-2026 01:33 AM

సత్తుపల్లి క్యాంప్ ఆఫీసులో కేక్ కటింగ్

సత్తుపల్లి, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే.క్యాంప్ కార్యాలయం లో ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ పుట్టినరోజు  వేడుకలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఆధ్వర్యంలో ఘనంగా జరిగినవి...ఈ కార్యక్రమం లో సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్స్ పాల్గొన్నారు.

కల్లూరులో..

కల్లూరు,ఏప్రిల్ 21(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ జన్మదిన వేడుకలు కల్లూరులో ఘనంగా నిర్వహించారు. మంగళవారం బస్స్టాండ్ సెంటర్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శీలం బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్కే సిరా ఉద్దీన్,జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు ఇజ్జిగాని శ్రీలత,కల్లూరు మండల కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యలమరెడ్డి వెంకట రామిరెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.

అనంతరం ప్రజల దాహార్తిని తీర్చేందుకు బస్స్టాండ్ సెంటర్లో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయగా,కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కు కృష్ణయ్య,ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పసుమర్తి చందర్రావు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బంకా కుటుంబరావు, మత్తి శ్రీనివాసరావు,బొల్లం వెంకటేశ్వరరావు,వనకు నరసింహారెడ్డి,బస్విరెడ్డి, అవులూరు శ్రీనివాస్ రెడ్డి,యరమల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.