28 June, 2026 | 1:04 AM

ఆదర్శ కుటుంబం డేట్ ఫిక్స్

28-06-2026 12:05 AM

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న కుటుంబ కథా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47  ఏకే47’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో వెంకటేశ్, శ్రీనిధి శెట్టి ఎంతో హుందాగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఆత్మీయ కుటుంబ కథకు అద్దం పట్టేలా ఉన్నారు. 

ఈ చిత్రం భావోద్వేగాలు, వినోదం, హృదయాన్ని హత్తుకునే క్షణాలతో నిండిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతుందని పోస్టర్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, కెవిన్ కుమార్ యాక్షన్ సన్నివేశాల కొరియోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.