షీ ఈజ్ మై..
29-07-2026 01:04 AM
జీవీ ప్రకాశ్‌కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’. మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ మెలోడీ ‘షీ ఈజ్ మై’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ పాటను రాజశ్రీ సుధాకర్ రాయగా, అరవింద్ శ్రీనివాస ఆలపించారు. ఈ పాటలో కథానాయకుడు జీవీ ప్రకాశ్‌కుమార్, కథానాయకి కయదు లోహర్‌ల మధ్య కెమిస్ట్రీ చాలా ఆసక్తికరంగా వుంది. ఈ చిత్రానికి డీవోపీ: అరుణ్ రాధాకృష్ణన్; ఎడిటర్: రాజేశ్ ఎం; ఆర్ట్: శివశంకర్.






