12 May, 2026 | 10:59 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

సింగరేణి సీఎండీగా డి.కృష్ణ భాస్కర్ బాధ్యతల స్వీకరణ

16-12-2025 07:46 PM

రామగుండం,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ ప్రస్తుత సీఎండీ  ఎన్.బలరామ్ ఏడు సంవత్సరాల డిప్యూటేషన్ అనంతరం మాతృ విభాగానికి తిరిగి వెళుతున్న నేపథ్యంలో సింగరేణికి  సీఎండీ (ఎఫ్ఏసీ)గా  దేవరకొండ కృష్ణ భాస్కర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆయన సింగరేణి భవన్ లో  బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుత ఛైర్మన్ ఎన్.బలరామ్ నుండి బాధ్యతలను తీసుకున్నారు. ఆయనకు సింగరేణి డైరెక్టర్లు, జీఎంలు స్వాగతం పలికారు.

డి.కృష్ణ భాస్కర్ 2012  బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఆయన తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు కలెక్టర్ గా విధులు నిర్వహించారు. తెలంగాణ ఇండస్ట్రీస్ శాఖకు డైరెక్టర్ గానూ,  రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక శాఖకు స్పెషల్ సెక్రటరీ గానూ వ్యవహరించారు.