ఓటే ప్రజాస్వామ్యానికి పునర్జీవం
ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు కృషి చేయండి
కాంగ్రెస్ సీనియర్ నాయకులు దొంతగాని కోటేష్ గౌడ్
జవహర్ నగర్,(విజయక్రాంతి): ఓటే భారత ప్రజాస్వామ్యానికి పునరు జీవనమని ప్రతి ఒక్కరూ ఎన్యుమరేషన్ ప్రక్రియలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోటేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఓటు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిదని ఎస్ఐఆర్లో భాగంగా ప్రభుత్వ ఓటింగ్ అధికారులకు సహకరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులతో శుక్రవారం ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దొంతగాని కోటేష్ గౌడ్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఓటరే విలువైన శక్తి అన్నారు. జవహర్ నగర్ లో 100% ఎస్ఐఆర్ నమోదే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు.






