5వ బెటాలియన్‌కు నూతన కమాండెంట్‌గా సివి లక్ష్మీకాంత్ రావు బాధ్యతల స్వీకరణ
గోవిందరావుపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా చల్వాయి 5వ బెటాలియన్ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ నూతన కమాండెంట్‌గా సి.వి. లక్ష్మీకాంత్ రావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆయన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో విధులు నిర్వహిస్తూ తన ప్రతిభ, సమర్థతతో విశిష్ట సేవలు అందించారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం బెటాలియన్ అధికారులు, సిబ్బందితో కమాండెంట్ సమావేశమై పరస్పరం మాట్లాడారు. ఈ సందర్భంగా బెటాలియన్‌లో క్రమశిక్షణ, విధి నిర్వహణలో అంకితభావం, సమన్వయం, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని సూచించారు. బెటాలియన్ అభివృద్ధి, సిబ్బంది సంక్షేమం, విధి నిర్వహణలో మరింత ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. నూతన కమాండెంట్‌కు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.






