నేతాజీ పాఠశాలలో ఘనంగా రాఖీ వేడుకలు
27-08-2026 10:21 PM
గణపురం,(విజయక్రాంతి): మండలంలోని బస్వరాజుపల్లి నేతాజీ పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలను గురువారం ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని సోదరభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉడుత సాంబయ్య యాదవ్ మాట్లాడుతూ... రాఖీ పండుగ ప్రేమ, ఆత్మీయత, రక్షణకు ప్రతీక అని తెలిపారు. విద్యార్థులు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు.






