12 March, 2026 | 7:29 AM

పాతాళానికి పసుపు సాగు

12-03-2026 12:23 AM
  1. అదే దారిలో మిర్చి.. 

వాణిజ్య పంటలకు

ప్రతికూల వాతావరణం

మహబూబాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): కొన్నేళ్ల క్రితం వరకు వాణిజ్య పం టలకు పెట్టింది పేరుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ ప్రాంతం ప్రసిద్ధిగా నిలిచేది. అయితే కొంతకాలంగా వాణి జ్య పంటల సాగుకు ప్రతికూల వాతావరణంతో పాటు గిట్టుబాటు ధర లభించకపో వడం వల్ల రైతులు రోజురోజుకు మిర్చి, పసుపు సాగు పట్ల అనాసక్తి చూపుతున్నారు.

దీనితో ఒకప్పుడు పసుపు, మిర్చి పంటలకు పెట్టింది పేరుగా నిలిచిన మహబూబాబాద్ జిల్లా ఇప్పుడు ఆ పంటల సాగు పాతాళానికి పడిపోయింది. గడచిన నాలుగేళ్లుగా మిర్చి పంటలో ఆశించిన దిగుబడి రాకపోవడంతో పాటు ధర కూడా పడిపోవడంతో రైతులు మిర్చి పంట సాగును ఏటేటా తగ్గిస్తున్నారు. ఇక ఇదే తరహాలో పసుపు సాగు విస్తీర్ణం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు వేల ఎకరాల్లో పసుపు సాగు చేయగా, ఇప్పు డు వందలకు పడిపోయింది.

మిర్చి, పసుపు పంటల సాగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతుండడంతో ఆ పంటలకు బదులుగా ప్ర త్యామ్నాయ పంటల సాగు చేపట్టారు. వా ణిజ్య పంటల్లో ఆయిల్ పామ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఎక్కువగా పత్తి ఆ తర్వాత మొక్కజొన్న సాగు చేస్తున్నారు. దీనివల్ల జిల్లాలో మిర్చి పంట, పసుపు పంట సా గు విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా పడిపోయింది.

మహబూబాబాద్ జిల్లాలో మిర్చి పంట సుమారు లక్ష ఎకరాల వరకు సాగు చేయగా ఇప్పుడు 30 వేలకు పడిపోయింది. అలాగే 20వేల ఎకరాలకు పైగా పసుపు సా గు చేసే దశ నుంచి 360 ఎకరాల అధమ స్థాయికి పడిపోయింది. ఇక ధర విషయానికి వస్తే మిర్చి పంటకు గరిష్టంగా 15 వేలు, ప సుపు కు 10 వేలకు మించకపోవడంతో దీర్ఘకాలిక పంటల సాగుతో నష్టపోయే బదులు ఇతర పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. గత ఐదేళ్లలో మిర్చి, పసుపు సాగు విస్తీర్ణం, దిగుబడి వివరాలు ఇలా ఉన్నాయి. 

2021 - 22 

మిర్చి : 82,434 ఎకరాలు

దిగుబడి: 1,64,869 మెట్రిక్ టన్నులు 

పసుపు: 4,406 ఎకరాలు 

దిగుబడి: 8,812 మెట్రిక్ టన్నులు 

2022- 23 

మిర్చి: 56,131 ఎకరాలు

దిగుబడి: 1,12,262 మెట్రిక్ టన్నులు 

పసుపు: 1,155 ఎకరాలు 

దిగుబడి: 2,310 మెట్రిక్ టన్నులు 

2023- 24

మిర్చి: 70,272 ఎకరాలు

దిగుబడి: 1,40,545 మెట్రిక్ టన్నులు 

పసుపు: 265 ఎకరాలు 

దిగుబడి: 530 మెట్రిక్ టన్నులు 

2024- 25

మిర్చి: 48,730 ఎకరాలు 

దిగుబడి: 97,459 మెట్రిక్ టన్నులు 

పసుపు: 372 ఎకరాలు

దిగుబడి: 745 మెట్రిక్ టన్నులు 

2025- 26

మిర్చి: 31,554 ఎకరాలు 

దిగుబడి: 63,109 మెట్రిక్ టన్నులు 

పసుపు: 366 ఎకరాలు 

దిగుబడి: 732 మెట్రిక్ టన్నులు

ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి

మహబూ బాబాద్ జిల్లాలో రైతులు దీర్ఘకాలిక పంటలైన మిర్చి, పసుపు సాగు వల్ల ఆశించిన దిగుబడి, ధర రాకపోవడంతో ఆ పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా ఆయిల్ పా మ్, మల్బరీ, ఉద్యాన పంటలు, పండ్ల తోటల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం వాణిజ్య, పండ్ల తోట లు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగుకు రాయితీ ఇస్తుంది.

పుట్టగొడుగులు, దీనికి గల పెంపకం, పూల తోట ల సాగుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంది. దీనివల్ల రైతులకు ఆశించిన దిగుబడి, ధర లభించి నష్టాల బారిన పడకుండా ప్రత్యామ్నాయంగా దోహదపడుతుంది. 

జినుగు మరియన్న, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, మహబూబాబాద్