17 July, 2026 | 2:04 AM

ఫసల్ బీమాను అమలు చేయాలి

17-07-2026 12:00 AM

బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తక్షణమే అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యో జనను అమలు చేస్తామని, రైతు చెల్లించాల్సిన ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని రైతు డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చిందని, కానీ ఈ పథకం కింద కేటాయించిన రూ.3 వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు.