7 May, 2026 | 2:23 AM

ముఖ్యమంత్రిని కేటీఆర్ విమర్శిస్తే సహించేది లేదు

07-05-2026 12:00 AM
  1. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో కోట్లు దోచుకున్న ఘనత 
  2. కేసిఆర్ కుటుంబానిదే.. ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి, మే 6 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరంగల్ లోని రైతు సభలో కేటీఆర్ విమర్శించారని దీన్ని సహించేది లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత కేసిఆర్ కుటుంబానికి దక్కిం దని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని మార్కెట్ కా ర్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంలో నిర్వహించిన రైతు వారోత్సవాల్లో బుధవారం పాల్గొన్నారు.

తదుపరి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు మహాలక్ష్మి పథకం ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, రుణమాఫీ సన్న బియ్యం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్, పథకాలు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. బిజెపి మంత్రి బండి సంజయ్ ని విమర్శించలేక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తప్పుడు మాటలు మాట్లాడడం, కేటీఆర్ అవివేకానికి నిదర్శమని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సంక్షేమ పథకాల పేరుతో కోట్ల రూపాయలు దోచుకొని నేడు కుటుంబాల మధ్య వారికి వారే చిచ్చులు పెట్టుకుంటూ, ఒకపక్క కల్వకుంట్ల కవిత మరొక కల్వకుంట్ల కేటీఆర్ ఒకరిపై మరొకరు దూషించుకుంటూ పబ్బం కడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిని మంత్రులు విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. కేటీఆర్ తన వక్రబుద్ధిని మార్చకుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

అనంతరం సర్కిల్ పరిధిలోని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, జిల్లా నాయకులు రేగటి రవి గౌడ్ దాసరి శ్రీను మాచర్ల అనిల్ పెద్దబోయిన అజయ్ కొండారాజు సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు