7 May, 2026 | 1:28 AM

జనగణన అవగాహన 2కె మారథాన్ నిర్వహణ

07-05-2026 12:00 AM

ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్: కృష్ణా రెడ్డి

మేడ్చల్ అర్బన్, మే 6(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన 2027 ప్రక్రియపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఎల్లంపేట్ మున్సిపల్ అధికారులు సిద్ధమైనారు. ఇందులో భాగంగా స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) విధానంపై అవగాహన కల్పించేందుకు నేడు గురువారం ఉదయం 10 గంటలకు 2కె మారథాన్ రన్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ పరిధిలోని స్వామి వివేకానంద విగ్రహం నుండి ప్రారంభమై బస్టాఫ్ వరకు కొనసాగుతుందని కమిషనర్ కృష్ణా రెడ్డి చెప్పారు. అంతేకాకుండా డిజిటల్ పద్ధతిలో జరిగే జనగణనలో ప్రజలు తమ వివరాలను తామే నమోదు చేసుకునే (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను ప్రోత్సహించడమే ఈ రన్ ప్రధాన ఉద్దేశ్యమని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కమిషనర్ ఆనందం వ్యక్తం చేశారు.