3 March, 2026 | 9:04 PM

కాచవాని సింగారంలో క్రికెట్ టోర్నమెంట్

03-03-2026 06:47 PM

టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి కేటీఆర్

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మల్లారెడ్డి గ్రూపు యూనివర్శిటీల చైర్మన్ చామకూర భద్రారెడ్డి  ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు  చామకూర మల్లారెడ్డి 50 వసంతాల వివాహ వార్షికోత్సవ వేడుకల (గోల్డన్ జూబ్లీ డే సెలబ్రేషన్) సందర్భంగా ఘట్ కేసర్ ఉమ్మడి మండలంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. ఈనెల 10వ తేదీ నుండి 17 వరకు కాచవాని సింగారం, నారపల్లి సెంట్రల్ గ్రౌండ్స్ లో "క్రికెట్ టోర్నమెంట్" నిర్వహించడం జరుగుతుందన్నారు. 

కాగా ఇట్టి టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ హాజరవుతారని తెలిపారు. ఈసమావేశంలో బిఆర్ఎస్ పార్టీ ఘట్ కేసర్ డివిజన్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, బోడుప్పల్ డివిజన్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, పీర్జాదిగూడ  మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి, బోడుప్పల్ మాజీ మేయర్ బుచ్చిరెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు మేకల నర్సింగ్ రావు, నాగులపల్లి రమేష్, పన్నాల కొండల రెడ్డి, చిలుకూరి గోపాల్ రెడ్డి, నీరుడి శ్రీనివాస్, సామల సందీప్ రెడ్డి,  ఉమ్మడి మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.