విజయవాడలో బిర్లా న్యూ ఎక్స్ పీరియన్స్ సెంటర్
ఆంధ్రప్రదేశ్, 7 మే 2026: బహుళ బిలియన్ డాలర్ల సీకేఏ బిర్లా గ్రూప్‌లో భాగమైన బిర్లా న్యూ , ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తమ మొదటి ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించింది. గవర్నర్‌పేటలోని మహాత్మా గాంధీ రోడ్డులో ఉన్న ఈ కేంద్రం, గోడలు, ఫ్లోర్లు, పైపులు, పుట్టీ , నిర్మాణ రసాయనాలతో సహా బిర్లా న్యూ యొక్క సమగ్ర ఉత్పత్తి శ్రేణిని ప్రదర్శిస్తుంది. ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్‌లు, గృహ యజమానులకు కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఉత్పత్తులను నిజంగా పరిశీలించటానికి పరిమిత అవకాశాలు మాత్రమే లభిస్తున్నాయి.
ఫలితంగా స్పెసిఫికేషన్లలో తేడాలు, సైట్‌లో పనితీరు సమస్యలు, ఖరీదైన రీవర్క్ వంటివి ఏర్పడతాయి. ఈ అంతరాన్ని పూరించటానికి బిర్లా న్యూ అందించిన సమాధానమే విజయవాడ ఎక్స్‌పీరియన్స్ సెంటర్. ఇది ఊహాగానాలపై కాకుండా, ప్రత్యక్ష అనుభవం ఆధారంగా మరింత నమ్మకమైన, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
బిర్లా న్యూ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ అక్షత్ సేథ్ మాట్లాడుతూ, తమకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన మార్కెట్‌గా సౌత్ ఇండియా నిలుస్తోందన్నారు. గణనీయమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతున్న ప్రాంతానికి కేంద్రంగా విజయవాడ నిలిచిందనీ, మార్కెట్‌లో మా కార్యకలాపాలను ఎలా పెంచుకోవాలనే దానిపై మా ఆలోచనా విధానాన్ని ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రతిబింబిస్తుందన్నారు.
ప్రధాన మార్కెట్ల వ్యాప్తంగా ఒక విస్తృత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్న తమ సంకల్పంలో, ఇది మొట్టమొదటిదన్నారు. ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లాలో రూ. 127 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫైబర్ సిమెంట్ బోర్డు ప్లాంట్‌తో సహా, దక్షిణ భారతదేశంలో తమ తయారీ, పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ వస్తున్న సంస్థకు, విజయవాడలో వినియోగదారులను ప్రత్యక్షంగా చేరుకునే కేంద్రాన్ని స్థాపించడం తమ వ్యూహాత్మక నిర్ణయంగా చెప్పుకొచ్చారు.






