యూరియా యాప్ పై ప్రజలకు అవగాహన
సదాశివనగర్,(విజయక్రాంతి): రైతులకు యూరియా యాప్ పై శనివారం మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి అవగాహన కల్పించారు. మేరకు జనగాం గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూరియా అప్ లో మొబైల్ నంబర్ లింక్ మీకు కావాల్సిన నెంబర్ ఉందో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలని, యూరియా వచ్చిన రోజు చెక్ చేసుకొని లేకపోతే అదే రోజు యూరియా బుక్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుంతుంది.
కావున రైతులు ముందుగా రైతు వేదిక లేదా గ్రామ పంచాయతీకి వచ్చి వ్యవసాయా విస్తరణ అధికారి వద్ద చెక్ చేసుకోవలని సూచించారు.రైతులు రెండు లేదా మూడు పంటలు వేసుకున్న యూరియా యాప్ లోమాత్రం మొత్తం భూమి కి ఏదేనా ఒకటే పంట నమోదు చేసుకోవాలని, రైతులు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్నటువంటి వరి సన్న మరియు దొడ్డు రకాలు వేసుకోవాలని,వరి కొయ్యలను కాల్చకుండా పొలం లో నే మురిగేలా చూసుకోవాలని, ఇంకా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోలేని రైతులు ఇంకా వ్యవసాయ శాఖ సంబంధిత సమస్యలు ఉన్న రైతులు రైతు వేదిక వద్ద వ్యవసాయ విస్తరణ అధికారి ని లేదా మండల వ్యవసాయ అధికారి ని సంప్రదించలని సూచించారు.






