ఉపాధ్యాయులకు సంసిద్ధత కార్యక్రమాలపై అవగాహన
మండల విద్యాధికారి ఏ.రాజయ్య
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి అధ్యక్షతన స్థానిక ఎంపీడీవో హాల్ సుల్తానాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జూన్ మాసం చివరి వరకు బడిబాట కార్యక్రమాలు కొనసాగించాలని తెలిపారు. తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు, సభ్యుల సహకారంతో ఎన్రోల్మెంట్ పెంచవలసిందిగా కోరనైనది.
అదేవిధంగా రేపటినుండి 45 రోజుల వరకు పాఠశాలలో సంసిద్ధత కార్యక్రమాలునిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సకాలంలో క్యాప్చర్ చేయాలని తెలియజేశారు. ఫౌండేషనల్ లిటరేసి అండ్ న్యూమరసిలో భాగంగా విద్యార్థుల యొక్క సామర్ధ్యాలను గుర్తించి జూలై మొదటి వారంలో బేస్ లైన్ పరీక్ష కండక్టు చేసి ఆన్లైన్లో నమోదు చేయవలెనని తెలిపారు.






