20 June, 2026 | 8:03 PM

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు

20-06-2026 06:44 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణం,మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల నియంత్రణ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ డిమాండ్ చేశారు. అట్టి సమస్యలపై ఆయన మండల విద్యాధికారికి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ మాట్లాడుతూ... బెల్లంపల్లి పట్టణంలో మండల కేంద్రం లోని ప్రైవేట్ పాఠశాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ, పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తూన్నారని విమర్శించారు.

కేవలం దనర్జనే ద్యేయంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూన్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యా సంస్థల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నా యన్నారు. అధిక ఫీజుల వసూలుకు నియంత్రణ కోసం కమిటీ వేస్తాన్న  ప్రభుత్వం  ఇప్పటి వరకు కమిటీ వేయకపోవడం కార్పొరేట్ వ్యవస్థకు ఆజ్యం పోస్తుందని విమర్శించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వారిని పరిష్కారం చేయాలనీ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలో కాల్టేక్స్ ఏరియా లో ఒక పాత ప్రైవేట్ పాఠశాల కొనుగోలు చేసి ఆ పాఠశాలను పాత పేరుతో (దేవి పబ్లిక్ స్కూల్) నడపకుండా తవక్కల్ విద్యా సంస్థలు అని పెరు మార్చి నడుపుతూ విద్యార్థులను,వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్న తవక్కల్ పాఠశాల వెంటనే సీజ్ చేయాలన్నారు. లేని పక్షంలో BRSV అద్వ్యర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తుంది.