20 June, 2026 | 7:46 PM

కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి

20-06-2026 06:26 PM

ఇల్లందు,(విజయక్రాంతి): కొమరారం గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కొమరారం మండల సాధన కమిటీ కన్వీనర్ వాంకుడోతు మోతిలాల్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి దామోదర రాజనరసింహను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోతిలాల్ మాట్లాడుతూ కొమరారం మండల ఏర్పాటు వల్ల ప్రజలకు పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని,

ఇల్లందు మండలం విస్తీర్ణం పెద్దదిగా ఉండటంతో ప్రజలు వివిధ ధ్రువపత్రాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే కొరం కనకయ్య మండల ఏర్పాటు హామీ ఇచ్చారని, సర్వే కూడా నిర్వహించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొమరారంను మండలంగా ప్రకటించాలని కోరారు. ఈ విషయంపై మంత్రి దామోదర రాజనరసింహ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.