నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం
అంతిమ యాత్రలో భద్రయ్య పాడే మోసిన మాజీ ఎంపీ నామ
మహబూబాబాద్: జిల్లా బలపాల గ్రామానికి చెందిన నామ భద్రయ్య (95) ఆదివారం రాత్రి వృద్ధాప్య కారణాలతో పరమపదించారు. ఆయన మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ సోమవారం ఉదయం వారి స్వగృహానికి చేరుకుని భద్రయ్య పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్న నామ స్మశాన వాటిక వరకు పాడె మోసినారు. భద్రయ్య కుమారుడు రమేష్, కుమార్తె విజయ లను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. గ్రామస్థులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై చివరి వీడ్కోలు పలికారు.






