20 June, 2026 | 7:45 PM

బాసరలో త్రిబుల్ ఐటీ సీట్ సాధించిన టాలెంట్ స్కూల్ విద్యార్థి

20-06-2026 06:33 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): ఇటీవల విడుదలైన బాసర త్రిబుల్ ఐటీ ఫలితాలలో స్థానిక సత్తుపల్లి టాలెంట్ స్కూల్ విద్యార్థి నారపోగు రామ్ చరణ్ తేజ కు బాసర త్రిబుల్ ఐటీ లో సీట్ సాధించడం పట్ల టాలెంట్ స్కూల్ కరెస్పాండెంట్ పులి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. త్రిబుల్ ఐటీ సీట్ సాధించిన విద్యార్థి రామ్ చరణ్ తేజను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ మరియు సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం  శాలువాతో సత్కరించి అభినందించడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో టాలెంట్ స్కూల్ కరెస్పాండెంట్ పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ... నర్సరీ నుండి పదవ తరగతి వరకు మా పాఠశాలలో చదివి, పదవ తరగతి ఫలితాల్లో 573 మార్కులు సాధించి, ఈరోజు బాసర త్రిబుల్ ఐటీ లో సీటు సాధించడం ఎంతో గర్వకారణం అని అన్నారు. మా విద్యాసంస్థ నుంచి ప్రతి సంవత్సరం అనేకమంది విద్యార్థులకు మెడిసిన్ సీట్లు, త్రిబుల్ ఐటీ సీట్లు సాధిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ పులి అరుణ  స్కూల్ ఇంచార్జ్ శంకర్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు