కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం
20-06-2026 06:12 PM
రుద్రంగి,(విజయక్రాంతి): అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగ దినోత్సవన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులు యోగ లో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ బాబు నంబియార్ మాట్లాడుతూ... యోగ చేయడం వల్ల మనిషి ఆరోగ్యవంతగా ఉంటారని ఎటువంటి ఒత్తిళ్లకు గురికాకుండా మానవ శరీరం కంట్రోల్లో ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగసనాలు వేయాలని కోరారు. అందరూ యోగను దినచర్యగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ లతిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






