సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆధునిక సాంకేతికతపై అవగాహన
ఘట్‌కేసర్, ఆగస్టు 28 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ లోని సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తుది సంవత్సరం సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం సస్టైనబుల్ క న్స్ట్రక్షన్, ఆధునిక సాంకేతికతలు, భవిష్యత్ కె రీర్ అవకాశాలపై నిపుణుల ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. రీజినల్ హెడ్, టెక్నిక ల్ సర్వీసెస్ (తెలంగాణ) అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ ఇంజినీర్ నందిక శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని సస్టైనబుల్ కన్స్ట్రక్షన్, గ్రీన్ బిల్డింగ్స్, స్మార్ట్ టెక్నాలజీస్ ఏఐ ఆధారిత పరిష్కారాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆధునిక సాంకేతికతల ద్వారా నిర్మాణ నాణ్యత, భద్రత, సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణ, వనరుల సమర్థవంతమైన వినియోగాన్ని మెరుగుపరచవచ్చని వి వరించారు. కార్యక్రమంలో కాంక్రీట్ టెక్నాలజీ సబ్జెక్టులో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి పల్లవి బద్రీ, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆచరణాత్మక జ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు వృత్తిపరమైన సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు.






