ఆసియా క్రీడలకు ద్వితీయ శ్రేణి జట్టు
నిర్ణయం మార్చుకునే దిశగా బీసీసీఐ
సరైన ఏర్పాట్లు లేకపోవడమే కారణం
జపాన్ గ్రౌండ్లు, వసతిపై అసంతృప్తి
ముంబై , ఆగస్టు 28: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల కోసం కౌంట్ డౌన్ మొదలయింది. వచ్చే నెలలో జపాన్ వేదికగా ఈ క్రీడలు జరగనున్నాయి. అయితే ఈ క్రీడల కోసం క్రికెట్ జట్టును పంపించే విషయంలో బీసీసీఐ పునరాలోచనలో పడింది. ఈ టోర్నీకి ద్వితీయ శ్రేణి జట్టును పంపేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు సమాచారం.
జపాన్‌లో సరైన క్రికెట్ మైదానాలు లేకపోవడం, వాష్ రూ మ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ అధ్వానంగా ఉండడమే దీనికి కారణం. అయితే ఇప్పటికే ఈ టోర్నీలో ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జపాన్‌లోని ఐచి నగోయా క్రికెట్ మ్యాచ్‌లు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే అక్కడ సరైన ఏ ర్పాట్లు చేయలేదని తెలుస్తోంది. జపాన్‌లోని వసతులపై బీసీసీఐతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా అసంతృప్తిగా ఉందని బో ర్డు వర్గాలు తెలిపాయి.
బీసీసీఐతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సైతం జపాన్‌లోని సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్నాయనీ, అందుకే అక్కడికి అబ్జర్వర్‌ను పంపించాలనుకుంటున్నాయనీ బోర్డు వర్గాలు తెలిపాయి.. అబ్జర్వర్ నివేదికను బట్టి జట్టు మార్పు విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుం దనీ వెల్లడించాయి. బీసీసీఐతో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా జపాన్‌లోని వసతులపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఒక మ్యాచ్‌ను కనీసం 2 వేల మంది ప్రేక్షకులు అయినా వీక్షించేలా స్టేడియం ఉండాలి. కానీ జపాన్‌లో అలాంటి పరిస్థితి లేద ని తెలుస్తోంది.






