29 August, 2026 | 1:39 AM

ముఖ్యమంత్రికి రాఖీ కట్టిన సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు

29-08-2026 12:37 AM

గజ్వేల్, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డిని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రికి పవిత్ర శుభాకాంక్షలు తెలియజేసి రాఖీ కట్టారు. రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు ఆంక్షారెడ్డి పేర్కొన్నారు.