సీపీఎస్ రద్దు చేయాలి.. పీఆర్సీ, డీఏలు అమలు చేయాలి
28-08-2026 12:00 AM
ఆసిఫాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీ ఈజేఏసీ ఉద్యోగ, ఉ పాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2018 నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, ఆరు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేయాలని, ఎంప్లాయిస్ హెల్త్ కార్డ్ స్కీమ్ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. 317 జీవో కింద దరఖాస్తు చేసుకున్న వారికి పెం డింగ్లో ఉన్న డిప్యూటేషన్లు జారీ చేసి న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సం ఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.






