28 August, 2026 | 12:35 AM

రైతులకు శాశ్వత డిజిటల్ భూ రికార్డు సర్వే

27-08-2026 11:00 PM

ముకరంపుర,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఆధునిక సర్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాష్ట్రంలోని మొదటి విడతగా -రీ సర్వే ద్వారా ఖచ్చితమైన జియో-రిఫరెన్స్‌డ్ కాడస్ట్రల్ మ్యాపులు మరియు శాశ్వత డిజిటల్ భూ రికార్డుల  సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్బంగా మొదటి విడతలో కరీంనగర్ జిల్లాలో షెడ్యూల్ క్రమము గన్నేరు వరం మండలం యస్వడా గ్రామములో నిర్వహించిన రీ సర్వే గ్రామ సభ కు అడిషనల్ కలెక్టర్ డా. డి శ్రీనివాస్ రెడ్డి  హాజరై రైతులకు రి సర్వే ద్వారా శాశ్వత భూ సమస్యల పరిష్కారం, సర్వే అనంతరం రైతులకు శాటిలైట్  మ్యాప్ లను  అందజేయడం జరుగుతుంది. రైతులకు న్యాయం చేయుటకు సులభతరంగా ఖచ్చితంగా, పారదర్శకంగా మరియు డిజిటల్ రూపంలో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని  రైతులు రి సర్వే కు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ Dr. D. శ్రీనివాస్ రెడ్డి  రైతులను ఉద్దేశించి మాట్లాడారు,  ఇట్టి గ్రామ సభలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ కిషన్ రావు  , తహసిల్దార్ నరేందర్  గ్రామ సర్పంచ్  తిరుపతి మరియు రైతులు  పాల్గొన్నారు.