19 June, 2026 | 3:32 AM

విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని సీపీఎం వినతి

19-06-2026 01:19 AM

దామరచర్ల, జూన్ 18: విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని, ప్రవేట్ పాఠశాలలలో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల విద్యాధికారికి గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి మాలోత్ వినోద్ నాయక్ మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా అన్ని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు.

పాఠశాలలలో నోట్ బుక్స్, యూనిఫారమ్స్ అమ్ముకుంటూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని చెప్పారు. వెంటనే అధికార యంత్రాంగం అన్ని ప్రైవేటు పాఠశాలలలో తనిఖీలు నిర్వహించి పాఠశాలల్లో ఉన్న నోట్ బుక్స్ యూనిఫారమ్స్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ  పాఠశాలలను బలోపేతం చేయడం తోపాటు విద్యా హక్కు చట్టాన్ని అమలు అయ్యే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దయానంద్, సుభాని, విజయ్ తదితరులు పాల్గొన్నారు.