1 June, 2026 | 12:01 PM

Breaking News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •   సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్   •   రామేశ్వరం కోనేరులో పడి మహిళ మృతి   •   ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడిగా బిల్లకంటి హరిబాబు గెలుపు   •   సింగరేణిలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహణ   •   భద్రాచలంలో విలేకరుల ముసుగులో అక్రమదందా   •   కేసీఆర్‌తో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ   •   జాగరి గట్టమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం   •   హైదరాబాద్‌లో అవార్డు అందుకున్న ఆదివాసి బిడ్డ   •  

ప్రజాసంఘాల నాయకుల ముందస్తు అరెస్టులను ఖండించిన సీపీఎం

01-06-2026 10:36 AM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా సమస్యలపై వినతిపత్రాలు అందజేయడానికి సిద్ధమవుతున్న ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని సీపీఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్ తెలిపారు.సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. వినతిపత్రాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్న నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.

ప్రజల సమస్యలను వినాల్సిన ప్రభుత్వం, వాటిని ప్రస్తావించే నాయకులను అడ్డుకోవడం సరైన విధానం కాదన్నారు. అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, నిర్బంధ చర్యలను విరమించాలని దుర్గం దినకర్ కోరారు.