30 July, 2026 | 8:46 PM

Breaking News

హైదరాబాద్‌లో అవార్డు అందుకున్న ఆదివాసి బిడ్డ

01-06-2026 10:38 AM

బెజ్జూర్, జూన్ 01 (విజయక్రాంతి): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలానికి చెందిన ఆదివాసీ యువతి కుడుమేత చెంచులక్ష్మి  హైదరాబాదులో అవార్డు అందుకుంది.శంకర్,రాజుబాయి దంపతుల కుమార్తె కె. చెంచులక్ష్మి హైదరాబాద్‌లో జరిగిన ఏఐ అచ్చివర్స్ నేషనల్ లెవెల్ ప్రోగ్రాం లో ప్రతిభ కనబర్చి ఏఐ బిజినెస్ అచ్చివర్ అవార్డు ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఏఐ రంగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న చెంచులక్ష్మి, ప్రస్తుతం 100 మందికి పైగా విద్యార్థులు, యువతకు ఏఐ శిక్షణ అందిస్తూ ముందుకు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ పై అవగాహన కల్పిస్తూ అనేక మందికి మార్గదర్శకురాలిగా నిలుస్తోంది.హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన నేషనల్ లెవెల్ కార్యక్రమంలో పాల్గొని ఏఐ బిజినెస్ విభాగంలో అచ్చివర్ గా ఎంపికైన ఆమెకు ప్రముఖ ఏఐ ఫౌండర్ & కోచ్ నికీల్  శాలువాతో ఘనంగా సన్మానించి అవార్డు, సర్టిఫికెట్ ను అందజేశారు. 

ఈ సందర్భంగా  చెంచులక్ష్మి, మాట్లాడుతూ నేర్చుకున్న ఏఐ జ్ఞానాన్ని మరెందరికో నేర్పించి, గ్రామీణ యువత కూడా టెక్నాలజీ రంగంలో ముందుకు రావాలని నా లక్ష్యం” అని భావోద్వేగంగా తెలిపారు. ఆమె మాటలు అక్కడ ఉన్న వారిని ఎంతో ప్రేరణ కలిగించాయి.మారుమూల ఆదివాసీ ప్రాంతం నుంచి వచ్చి కష్టపడి నేర్చుకుని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన చెంచులక్ష్మి విజయం ప్రస్తుతం యువతకు స్ఫూర్తిగా మారింది.“పట్టుదల ఉంటే గ్రామం నుంచి కూడా ప్రపంచ స్థాయికి ఎదగొచ్చు” అని ఆమె మరోసారి నిరూపించింది.