27 June, 2026 | 3:47 AM

పట్టణంలో రోడ్లపై గేదెల సంచారంతో ప్రమాదాలు

27-06-2026 02:23 AM

నల్లగొండ టౌన్, జూన్ 26 : నల్లగొండ పట్టణంలో గేదెలు, మేకలు సంచారంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గేదలు, మేకలు అకస్మాత్తుగా రోడ్డు దాటడం, రోడ్డుపైనే పడుకోవడం,డివైడర్ల మధ్య గడ్డి మేయ డం, రోడ్డు మధ్య నిలబడడంతో వచ్చి పోయే వాహనదారులను వాటి కొమ్మలతో వాహనదాలను పొడుస్తున్నాయి. కొమ్ములతో గుద్దుతున్నాయి. కార్లు డ్యామేజ్ అవుతుండగా, వాహనదారులు అదుపుతప్పి కింద పడడంతో కాళ్లు, చేతులు విరిగి ఆస్పత్రుల పాలవుతున్నారు.

మరికొందరు తీవ్రంగా గాయాలు తగిలి చనిపోయిన సందర్భాలున్నాయి. ఇవి నిత్యకృతంగా మారిన మున్సిపాలిటీ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మేకలు, గేదెల యజమానులు ఇష్టానుసారంగా రోడ్లపై వాటిని మేత కోసం వదిలేస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా అనేకమంద క్షతఘాత్రులుగా మారడం, ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది. బాధిత కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా వాటి యజమానులు రోడ్లపైకి వదలకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.