గోవులను నదులతో సమానంగా గౌరవించాలి
మధిర,(విజయ క్రాంతి): గోవులను నదులతో సమానంగా గౌరవించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి రామిశెట్టి నాగేశ్వరావు అన్నారు. మంగళవారం మధిర పట్టణంలోని తాహసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో సమస్త గో ప్రేమిక జన సందోహాలకు ఆరాధన గో ప్రచార ఉద్యమం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.....గోవును దేశమాతగా ఆరాధ్యనీయ దేశ దేవతగా దేశ ఔన్నత్యానికి చిహ్నంగా గౌరవించబడవలెను.
భారతదేశంలో సంపూర్ణ గోహత్య నివారణ గల ప్రతిబంధకాలు గోహత్యను రూపుమాపుట ఇందులో దేశి గో వంశ సంరక్షణ గో సేవ కొరకు కేంద్ర చట్టమును గో సేవ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయవలెను. గో పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేసి వేద లక్షణాలు కలిగి ఉన్న గో ఆధారిత పంచగవ్య ఆత్పాదనల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. 27 ఏప్రిల్ 2026న దేశవ్యాప్తంగా తాహసిల్దార్ మండల అధికారి జిల్లా కలెక్టర్ ద్వారా మన ప్రియతమ రాష్ట్రపతి, ప్రధానమంత్రి , గవర్నర్ , ముఖ్యమంత్రి లకు వినతి పత్రాలు అందజేశారు.






