6 May, 2026 | 9:02 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు

14-02-2026 12:00 AM

లెక్కింపు ప్రక్రియను పరిశీలించిన అధికారులు

మంచిర్యాల, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహించారు. జిల్లాలోని 149 వార్డుల పరిధిలో 2,94, 297 (పురుషులు 1,45,403, మహిళలు 1,48,867, ఇతరులు 27) మంది ఓట ర్లుం డగా 2,01,875 (పురుషులు 99,759, మహిళలు 1,02,110, ఇతరులు 6) మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా శుక్రవారం కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు.

ఇందు కోసం జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ను హాజీపూర్ మండలంలోని ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించగా క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని సూపర్ బజార్ ఏరియాలో గల ఆర్.కె.సి.ఓ.ఎ. క్లబ్ లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ప్రత్యేక అధికారి, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పా టు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్, చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని అటవీశాఖ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారి, డీఆర్డీవో కిషన్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ లతో కలిసి సందర్శించి ఓట్ల లెక్కింపును పరిశీలించారు