25 April, 2026 | 5:14 AM

పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం

25-04-2026 01:39 AM

ముసిపల్ ఛైర్పర్సన్ సమిండ్ల వాణి 

జగిత్యాల, ఏప్రిల్ 24 ( విజయక్రాంతి ) :జగిత్యాల పురపాలక సంఘం కార్యాలయంలో అధ్యక్షురాలు సమిండ్ల వాణి శ్రీని వాస్ అధ్యక్షతన అధ్యక్షతన ఏప్రిల్ మాస ము కౌన్సిల్ సర్వసభ్య సమావేశం శుక్రవారం రోజున నిర్వహించారు. సమావేశములో  చైర్ పర్సన్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణములో రాబోవు వర్ష కాలము దృష్ట్యా పట్టణ పారిశుద్యమునకు ప్రాధాన్యత ఇస్తూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్, కెమికల్స్, ఫాగింగ్ మెషిన్స్, బ్యాక్ హో లోడర్, బ్యాటరి స్ప్రే మిషన్స్, వేహికిల్ మౌంటెడ్ ఫగ్గింగ్ మిషన్లు వాటి కొనుగోలు నిమిత్తం 0.90 కోట్లు నిధులు, అలాగే బక్రీద్ పండుగ సందర్బముగా పురపాలక సంఘ ఆద్వర్యములో ప్రత్యేక ఏర్పాట్లకు గాను నిధులు 0.06 కోట్లు, జంక్షన్ ఫౌంటెన్ మరమత్తులు, రోటరీ పార్క్ లో ఫౌంటేన్, పార్కు అభివృద్ధి  పనులకు నిధులు 0.19 కోట్లు, ప్రస్తుత వేసవి కాలము దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా లీకేజిలను త్వరితగతిన అరికట్టుటకుగాను నిధులు,

పారిశుధ్య వాహనములకు మైక్స్ ఏర్పాటు, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ, లీకేజిలను రిపేర్ చేయుట పనులను కౌన్సిల్ యందు ఆమోదించడం  జరిగిందని తెలిపారు. ఈ సమా వేశములో (25) అజెండా అంశములు ప్రవేశ పెట్టగా కౌన్సిల్ ఆమోదించారు.పలువురు సభ్యులు సమస్యలను  దృష్టికి తీసుకరాగా ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులను ఆదేశించారు.ఈ సమావేశములో  వైస్ చేర్మెన్ జీనత్ పర్వీన్ మునిరోద్దిన్,  కౌన్సిల్ సభ్యులు, మునిసిపల్ కమీషనర్ స్పందన, మునిసిపల్ అధికారులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.