25 April, 2026 | 4:49 AM

ప్రగతి పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

25-04-2026 01:38 AM

అంబరాన్నంటిన సాంస్కృతిక కార్యక్రమాలు

రాయికల్, ఏప్రిల్ 24 ( విజయ క్రాంతి ) : రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యా ర్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకలో భాగంగా పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా సన్మానించి,వారికి మెమెంటోలు అందజేశారు. ఉపాధ్యాయుల సేవలను ప్రశంసిస్తూ వారి కృషిని కొనియాడింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక పరీక్ష ఫలితాలను కూడా ప్రకటించారు.నర్సరీ నుండి 9వ తరగతి వరకు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు ప్రదానం చేశారు.

యూకేజీ విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం గోల్ మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేసి ప్రోత్సహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ కార్యక్రమాలు ముఖ్యంగా నరసింహస్వామి అవతారం  నృత్యము ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మోర హన్మండ్లు మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్రాభివృద్ధి కోసం పాఠశాల నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాలలో కూడా ప్రతిభ కనబరచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్,కరస్పాండెంట్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.