25 April, 2026 | 3:24 AM

వేములవాడలో పోలీస్ అధిపతి ఆధ్యాత్మిక సందర్శనం

25-04-2026 01:41 AM

భీమేశ్వర స్వామి ఆలయంలో డీజీపీకి ఘన సత్కారం

వేములవాడ,ఏప్రిల్,24 (విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంను డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీజీపీ ఆలయ వసతి గృహానికి చేరుకోగానే పోలీస్ బృందం గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) సమర్పించింది. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన ఆయనకు అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచకంతో ఘన స్వాగతం పలికారు.

తరువాత స్వామివారి మండపంలో అర్చకులు, వేద పండితులు తీర్థ ప్ర సాదం అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ డీఈఓ భాస్కర శర్మ స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదం,చిత్రపటాన్ని డీజీపీకి అందజేశారు.ఈ కార్యక్ర మంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, వేములవాడ ఆర్డీఓ రాధాబాయి,వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, ఆలయ ఏఈఓ జి. అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.