ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిన అవినీతి
- పోలీస్టేషన్లో వసూళ్ల దందా?
అవినీతిపై ఏసీబీకి అందిన ఉప్పు
లంచావతారులపై ఏసీబీ నజర్?
బెల్లంపల్లి, ఏప్రిల్ 17: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతున్నదన్న ఆరో పణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అవినీతికి కాదేదీ ఏ విభాగం అన్నట్టు పరిస్థితీ మారిపోయింది. సేవారంగాలు, రక్షణ సం క్షేమ రంగాలన్నీ అవినీతితో కంపు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ఎవరో ఉప్పందించారు. అందుకే కాబోలు ఇటీవల ఏసీబీ అధికారులు తరచుగా బెల్లంపల్లికి వస్తూ పోతున్నారని ప్రచారం జరుగు తోంది. ఏసీబీ అధికారులు సామాన్యంగా ఎక్కడికి రారు. కాలక్షేపానికి ఏసీబీ అధికారులు ఎక్కడికి వెళ్లారు.
అవినీతి వాసన ఉంటేనే ఏసీబీ అధికారులు వస్తుంటారనీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఊరికే రారు.. వాస్తున్నారంటే.. పెద్ద స్కెచ్ వేసే ఉం టరు. ఇటీవల ఏసీబీ అధికారుల రాకపోకలు లీకుపై ప్రచారం జోరుగా సాగుతోంది. ఏసీబీ అధికారులు ఎక్కడికి వెళ్లినా సాధారణంగా వారి ఉనికిని ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. పదేపదే బెల్లంపల్లికి ఏసీబీ అధికారులు రావడం, అధికారుల అవినీతి స్మెల్ ను పసిగట్టి వారి కదలికలను ప్రజలు ఇట్టే కనిపెట్టారు.
అధికారులపై నిఘా..
బెల్లంపల్లిలో అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి కార్యకలాపాలు శృతి మించిచాయి. అం దుకు ఏ అధికారి మినహాంపు లేని పరిస్థితి నెలకొంది. రెవెన్యూ, మునిసిపల్, పోలీసు విభాగాల్లో అధికారుల అవినీతి పీడను ప్రజలు ఎదుర్కొంటున్నారని సమాచారం. కొందరు పోలీసు, అధికారులు ప్రజల సమస్యలను ఆసరాగా చేసుకుని ఎడాపెడా చేతులు తడుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఫ్యామిలీ, భూ సంబంధ ఇతర ఏ సమస్య అయినా పైసా లేనిదే పనిచేయడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. లక్షలు ముట్టచెప్పి రికమండేషన్ తో వచ్చిన పోలీస్ అధికారులు రికవరీ పనిలో పడ్డారనీ ప్రచారం జోరుగా ఉంది. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారిని నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారనీ తెలుస్తోంది. ప్రతి సమస్యను పైసలతోనే ముడిపె డుతున్నారనే ఆరోపణలు వెలువడుతున్నా యి.
ఇబ్బడిముబ్బడిగా అవినీతి దందా సా గుతున్నది. ఇదిలా ఉంటే ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు తక్కువేమీ కాదు. ప్రతి పనికి ఓ రేటు పెట్టుకున్నారు. దళారులు ఈ అవినీతిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. రెవెన్యూ, మునిసిపల్ కార్యాలయాల్లో పైస లు ఇవ్వనిదే ఏ పని అవ్వడం లేదనీ ప్రచా రం ఉంది. ప్రజాప్రతినిధులే ఇక్కడ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మునుపెన్నడూ లేనివిధంగా అవినీతి అక్రమాలు పెట్రేగిపోయాయి. పారద ర్శక పాలనా ప్రజలకు అందడంలేదు. ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి దాపురించడంతో అనివార్యంగా బాధితులు ఏసీబీ అధికారులకు ఉప్పందించకుండా ఉండలేకపోతు న్నారు. సేవారంగాలన్నీ అవినీతికి నిలయాలుగా మారిపోయాయి. ఉచిత సేవలకి స్వస్తి పలికి అధికారులు లంచాలకు ఎగబడ్డారు. పైసల కోసం ప్రజలను పీల్చీ పిప్పి చేస్తున్నారు.
ఈ పరిస్థితీలో మార్పు రావాలనే ఏసీబీ అధికారులు అవినీతి చేపలను పట్టుకునే వేటలో ఉన్నారు. ఇప్పటికే బెల్లంపల్లిలో ఓ పోలీసు అధికారి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి ఇతర అధికారు లు లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటనలున్నాయి. ఈ సంఘటనలేవీ అధికారుల్లో కాసింత మార్పు తేలేక పోయాయాయి. మరింతగా రెచ్చిపోయారు. అవినీతిలో కొందరు అధికారులు కూరుకుపోయారు. దీంతో బెల్లంపల్లిలో అవినీతి కార్యకలాపాల వ్యవహారం కాస్త ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్లక తప్పలేదు.
ఇది అధికారుల్లో ఒకింత అలజడి రేపుతోంది. బెల్లంపల్లిలో అన్ని ప్రభుత్వ శాఖల పైన ఏసీబీ అధికారుల డేగ కన్ను ఉందన్న వార్త వారి గుండెల్లో గుబులు రేపుతుంది. ప్రభుత్వాధికారులు, పోలీసు అధికారుల పనితీరుపై ఏసీబీ అధికారులు నజర్ పెట్టారంటే.. అధికారుల్లో అవినీతి ఏ స్థాయికి చేరిందో స్పష్టం అవుతున్నది. ఏసీబీ అధికారుల నిఘా, ప్రభుత్వ అన్ని శాఖలను ఉలక్కిపాటుకు గురిచేస్తోంది. ఏసీబీ వలలో ఎవరుపడుతారో.. చూడాలి మరి.






