calender_icon.png 8 February, 2026 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి ఆఫీసర్ శ్రావణి అరెస్టు

08-02-2026 01:21:31 AM

విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు 

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్త గూడెం ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ఏసీబీ అధికారులు శనివారం ఏపీలోని విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం సీతయిగూడెంలో ఈ నెల 3న రూ.28 లక్షలు డిమాండ్ చేసి, రేంజర్ రాజేందర్, మధ్యవర్తి గోపాలకృష్ణ ద్వారా రూ.3.50 లక్షలు లం చం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది.

టన్నుకు రూ.90 వేల చొప్పున మొత్తం రూ. 28 లక్షలు డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అప్పట్లోనే రేంజర్‌ను ఏసీబీ అధికారులు హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు. అప్ప టినుంచి డివిజనల్ అధికారిని శ్రావణి పరారీలో ఉన్నది. ఏసీబీ అధికారులు ఆమెపై నిఘా ఏర్పాటు చేసి విశాఖపట్నంలో ఉన్న ట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు బెయిల్‌కు ఆమె తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలుస్తోంది.