30 April, 2026 | 3:02 PM

నేరాల నియంత్రణ కోసమే కార్డెన్ సెర్చ్

30-04-2026 11:22 AM

తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య

బెల్లంపల్లి,(విజయక్రాంతి): నేరాల నియంత్రణ కొరకే కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య అన్నారు.గురువారం తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్చులాపూర్ గ్రామంలో కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ దేవయ్య మాట్లాడుతూ నేరాల నియంత్రణ కొరకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు తమ పరిధిలో అమార్చుకోవాలని కోరారు.

ప్రధాన కూడల్లతోపాటు ప్రతి ఇంటి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ పెట్టుకోవడంతో దొంగల బెడద సమసిపోతుందన్నారు. దొంగతనాలు జరిగినప్పుడు దొంగలను పట్టుకోవడానికి ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా వ్యవసాయ సీజన్ ప్రారంభ నేపథ్యంలో నకిలీ విత్తనాలను ఎవరు వాడరాదని, వాటివల్ల పంట నష్టం జరిగిన కూడా ప్రభుత్వ నుండి ఎలాంటి రుణం కూడా వర్తించవన్నారు. గ్రామంలో ఎక్కడైనా నకిలి పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లుగాని, రైతుల పొలాల్లో పెడుతున్నట్లు సమాచారం అందితే తమకు తెలియజేయాలని కోరారు. మైనర్ పిల్లలకు మోటారు వాహనాలను ఇవ్వరాదని ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లరాదని ఆటోలొ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని తెలిపారు.

మద్యం సేవించకుండా వాహనాలను నడపాలన్నారు. తమ సిబ్బంది ప్రతిరోజు తనిఖీలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. వేసవి నేపథ్యంలో విహారయాత్రకు వెళ్లేవారు, ఇంటి బయట నిద్రించే సమయంలో ఇంట్లో విలువైన వస్తువులను, నగదు సొమ్మును ఉంచుకోకూడదనితెలిపారు. బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలన్నారు. యువత ఆన్లైన్ గేమ్ లకు దూరంగా ఉండాలని కోరారు. మత్తు పదార్థాలు గంజాయి లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. కమ్యూనిటీ తనిఖీలో పట్టుబడిన వాహనాలకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఎస్సై ప్రసాద్ రావు, కన్నెపల్లి ఎస్సై భాస్కరరావు, మాదారం ఎస్ఐ సౌజన్య, భీమిని ఎస్సై తోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.