పల్లెల్లో వంట గ్యాస్ కష్టాలు
తొర్రూరులో స్టాక్ పాయింట్ వద్ద ఖాళీ సిలిండర్లతో బారులు తీరిన ప్రజలు
మహబూబాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యు ద్ధం నేపథ్యంలో వాణిజ్య గ్యాస్ కొరత తీవ్రం గా మారగా, తాజాగా గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్లకు కూ డా భారీగా డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా పల్లెల్లో సైతం వంట గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇండ్లల్లో వంట గ్యాస్ సిలిండర్లు నిండుకోవడంతో అవసరానికి తగ్గట్టుగా సిలిండర్లు డెలివరీ ఇవ్వకపోవడంతో ఏకం గా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్యాస్ డీలర్ స్టాక్ పాయింట్ వద్దకు గురువారం పె ద్ద ఎత్తున ఖాళీ గ్యాస్ సిలిండర్లతో వినియోగదారులు చేరుకున్నారు. గ్యాస్ సిలిండర్లు బుక్ చేయడానికి సాంకేతిక ఇబ్బంది సమస్యగా మారిందని, అతి కష్టం మీద బుక్ చేసి నప్పటికీ డెలివరీ చేయడం లేదని కొందరు, గ్యాస్ అయిపోయిన తర్వాత బుక్ చేయడానికి ప్రయత్నిస్తే బుక్ కావడం లేదని, ఆన్లైన్ కాల్ సెంటర్ పనిచేయడం లేదని మరికొందరు ఆరోపించారు.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 2.11 లక్షల మంది గృహ వంటగ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ఇందు లో భారత్, ఇండెన్, హెచ్ పీ గ్యాస్ కంపెనీల వినియోగదారులు ఉండగా, గత పక్షం రో జుల క్రితం వరకు ఫోన్ చేసి చెప్పగానే ఇం టికి డోర్ డెలివరీ చేసేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ బుక్ చేయడానికి ఇచ్చిన ఆన్లైన్ బుకింగ్ సర్వీస్ నంబర్లు సక్రమంగా పనిచేయడం లేదని, అలాగే సర్వర్ డౌన్ కావడంతో బుకింగ్ కు ఆటంకంగా మారిందని చెబుతున్నారు.
కచ్చితంగా ఆన్లైన్ బుకింగ్ చేయాలని, డెలివరీ ఓటిపి చెబితేనే గ్యాస్ సిలిండర్ ఇస్తామని డెలివరీ బాయ్ చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. దీనితో తప్పని పరిస్థితుల్లో ఏకంగా గ్యాస్ స్టాక్ పాయింట్ వద్దకే రావాల్సి వచ్చిందని చెప్పారు. వంటగ్యాస్ సిలిండర్ కు 60 రూపాయలు ధర పెంచారని, అయినప్పటికీ అడిగిన వెంటనే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అక్కడికి వచ్చిన వినియోగదారులకు వరుస క్రమంలో గ్యాస్ సిలిండర్లు అందజేశారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఆన్లైన్ ద్వారా చేస్తామని, గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.




