కో ఆప్షన్ సభ్యుల ఎన్నికపై వివాదం
06-05-2026 01:39 AM
జిన్నారం/అమీన్ పూర్, మే 5: గడ్డపోతారం మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికపై వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా నారబోయిన సరితా శ్రీనివాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కో-ఆప్షన్ సభ్యురాలిగా అవకాశం ఇస్తామని బీఆర్‌ఎస్ నాయకులు హామీ ఇచ్చి చివరకు మోసం చేశారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ పార్టీలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదని, డబ్బులు ఖర్చు పెట్టిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా కౌన్సిలర్లు స్వచ్ఛందంగా కాకుండా అధిష్టానం ఒత్తిడితోనే లక్ష్మి ప్రకాష్ చారిని ఎన్నుకున్నారని మండిపడ్డారు. ఈ పరిణామంపై స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.






