సుజాతనగర్ అభివృద్ధికి నిరంతర కృషి
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
సుజాతనగర్ జూలై, 27,( విజయక్రాంతి):కార్పొరేషన్ పరిధిలోని గ్రామాల రూపురేఖలు మార్చేలా సమగ్ర అభివృద్ధి పనులు చేపడుతున్నామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. సుజాతనగర్ మండల పరిధిలోని కార్పొరేషన్ డివిజన్లో రూ.1.95 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, డ్రైనేజీలు, మరుగుదొడ్లు, బస్ షెల్టర్ల నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుజాతనగర్లో మున్సిపల్ సబ్ డివిజన్ కార్యాలయ ఏర్పాటుతో పాటు, సింగభూపాలెం చెరువుకట్ట అభివృద్ధి కోసం రూ.5.5 కోట్లు మంజూరు కానున్నట్లు వెల్లడించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ (న్యాక్) కేంద్రం మంజూరైందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మేయర్ గణేష్, సొసైటీ అధ్యక్షులు హనుమంతరావు, టిపిసిసి సభ్యులు సీతారాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు, మున్సిపల్ కమిషనర్ సుజాత, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.






