25 June, 2026 | 1:07 AM

వసుదేవసుతం అందరికీ నచ్చే కంటెంట్

25-06-2026 12:15 AM

మాస్టర్ మహేంద్రన్, అం బికా వాణి జంటగా నటించిన చిత్రం ‘వసుదేవసుతం’. ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించారు. జూలై 10న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్లో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. “కృష్ణుడి మీద తీసిన ఈ కంటెంట్ జనాలకు నచ్చేలా రూపొందించాలని దర్శకుడు, నిర్మాతలు చాలా బాగా కష్టపడ్డారు. ఇందులో అద్భుతమైన కంటెంట్ ఉంది” అన్నారు.

‘వసుదేవసుతం సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంద’ని హీరోయిన్ అంబికా వాణి తెలిపింది. దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ.. “ఒరిస్సాలోని ఫేమస్ టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో రాసుకున్న ఈ కథ వన్ మెన్ షో. చివరి 45 నిమిషాలు మరోస్థాయిలో ఉంటుంది. నా మూవీ ఎవ్వరినీ నిరాశపర్చదు” అని చెప్పారు. ‘మా ఈ తొలి చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాన’ని నిర్మాత త్రినాథ్ కేశవ తెలిపారు. ఈ కార్యక్రమంలో మూవీటీమ్ పాల్గొన్నారు.