20 June, 2026 | 6:58 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ

01-04-2026 11:02 AM

గంటల తరబడి క్యూలైన్లో వినియోగదారులు

వాంకిడి,(విజయక్రాంతి): మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్(Gas Cylinder) కోసం వినియోగదా రులు పడుతున్న ఇబ్బందులు రోజురోజుకూ తీవ్రమవుతు న్నాయి. స్థానిక హెచ్‌పీ గ్యాస్ కార్యాలయం ముందు నిత్యం కనిపిస్తున్న క్యూలు ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తు న్నాయి. తెల్లవారుజాము నుంచే వినియోగదారులు సిలిండర్ల కోసం వరుసగా నిలబడి, చేతుల్లో టోకెన్లు పట్టుకుని గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ సమయానికి సరఫరా జరగకపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కోసం కార్యాలయానికి వెళ్లి, సిలిండర్లు అందక ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నా యి.సరఫరాలో జాప్యం కారణంగా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, గంటల తరబడి వేచి ఉండడం వల్ల తమ రోజు వారీ పనులు అస్తవ్యస్తమవు తున్నాయని చెబుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరిం చి గ్యాస్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని వారు కోరు తున్నారు.