1 April, 2026 | 12:37 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ

01-04-2026 10:59 AM

నంగునూరు,(విజయక్రాంతి): మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) నంగునూరు మండలం సిద్ధన్నపేట, దర్గాపల్లి గ్రామాల్లో పలువురు బాధితుల కుటుంబాలను పరామర్శించారు.అనారోగ్యంతో సిద్దిపేట సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధన్నపేట గ్రామ సర్పంచ్ సంగు పురేందర్‌ను పరామర్శించి,ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్యకర్త డాకూరి రాజశేఖర్ రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు.

నంగునూరు మండలం దర్గాపల్లిలో మై విలేజ్ షో డైరెక్టర్ అనిల్ తండ్రి ఇటీవల మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం సిద్ధన్నపేట గ్రామంలో ఇటీవల తండ్రిని కోల్పోయిన పంగ రాజశేఖర్ రెడ్డి, బొల్లు మహేష్ కుటుంబాలను ఓదార్చి సానుభూతి తెలిపారు.ప్రమాదాల్లో గాయపడిన గ్రామ హెల్పర్ లక్ష్మయ్య, తిరుపతి, కంతుల మల్లవ్వ,అనరాజుల పరశరాములు,అనారోగ్యంతో ఉన్న కత్తుల రాజిరెడ్డిని పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చారు.హరీష్ రావు వెంట మాజీ ఎంపీపీ జప శ్రీకాంత్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు లింగం గౌడ్,సీనియర్ నాయకులు ఎడ్ల సోమిరెడ్డి,రమేష్ గౌడ్,రాగుల సారయ్య తదితరులు ఉన్నారు.