లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
28-06-2026 03:55 PM
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సర్పంచ్ గుగులోతు మంగా
చర్ల,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని లింగాపురం గ్రామ పంచాయతీ, లింగాపురం, లింగాపురంపాడులో గల అంగన్వాడీ కేంద్రాల్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ గుగులోత్ మంగ ప్రారంభించారు. 0- 5 సంవత్సరాల లోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పోలియో రహిత సమాజమే మన లక్ష్యం. గ్రామంలో 0-5 ఏళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. ఏ ఒక్క చిన్నారి కూడా మిస్ కాకూడదు. తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి తీసుకొచ్చి చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు.






