28 June, 2026 | 5:15 PM

పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి

28-06-2026 03:52 PM

బోధన్,(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి బోధన్ పట్టణంలోని 29వ వార్డులో గల ఏరియా ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ మునిసిపల్ చైర్పర్సన్  తూము పద్మ శరత్ రెడ్డి మునిసిపల్ కమీషనర్ జాదవ కృష్ణ మునిసిపల్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాషా పావులూరి నాగవేంద్ర, మొదలగు వ్యక్తులు, బోధన్ డిఎంఎచ్ఓ డా.సమత రాకేష్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది డిప్యూటీ డిఎంఎచ్ఓ డా.దివ్య క్యాస్యుయాల్టీ మెడికల్ ఆఫీసర్ లు, స్టాఫ్ నర్స్ లు, ఆషా వర్కర్ లు, మొదలగు వైద్య సిబ్బంది ఆధ్వర్యం లో చిన్నారులు పోలియో చుక్కలు వేశారు.