28 June, 2026 | 5:06 PM

తహసీల్దార్ భవన నిర్మాణానికి 2 కోట్ల 25 లక్షలు మంజూరు

28-06-2026 04:04 PM

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి నూతన తహశీల్దార్ భావన నిర్మాణం కోసం 2 కోట్ల 25 లక్షలు మంజూరు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్ర పటాలకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎర్రం గంగానర్సయ్య మాట్లాడుతూ... భూ భారతి ప్రారంభోత్సవ సందర్భంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రుద్రంగికి రావడం జరిగిందని అట్టి సమయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తహశీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో ఉందని మంత్రికి తెలుపగ పక్క భవనానికి నిధులు ఇస్తామని చెప్పిన విదంగా ఈ రోజు నిధులు మంజూరు చేయడం జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశామని అన్నారు.

సర్పంచ్ గండి నారాయణ మాట్లాడుతూ.గత బీఆర్ హయాంలో పది సంవత్సరాలు ఏమ్మార్వో ఆఫీస్  అద్దె భవనంలో ఉందని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి నియోజకవర్గ అభివృద్ధి, సొంత ఊరు రుద్రంగి అభివృద్ధికి ఎన్నో కోట్ల నిధులు తీసుకవచ్చి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని అలాగే పోలీస్టేషన్ భావన నిర్మాణానికి భూమిపూజ చేసుకోవడం జరిగిందని అన్నారు. మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ... ప్రతిపక్ష నాయకులు చెప్పే అసత్య ఆరోపణలు ప్రజలు నమ్మవద్దని అన్నారు. అభివృద్ధి చేసే నాయకుడికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు.