ఉప్పరిగూడ రైతు వేదికలో విత్తన మేళా
29-07-2026 12:34 AM
ఇబ్రహీంపట్నం, జూలై28(విజయక్రాంతి): మండల పరిధి ఉప్పరిగూడ గ్రామం రైతు వేదిక లో రైతు నేస్తం 100వ భాగం కార్యక్రమం నిర్వహించారు. రైతులకు ఎల్ నినో ప్రభావాన్ని ఎదురుకొనే చర్యలలో భాగంగా, తక్కువ కాలపరిమితి,తక్కువ నీటి వినియోగం ఉన్న పంటల కి బదు లు పెసర, ఉలవ, స్వల్ప కాలిక కంది, నువ్వులు, పశుగ్రాస పంటలు పండించాలని, అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా జలసిరి లో భాగం గా అవకాశం కల్పిస్తున్న పంట కుంట/ ఫారం పాండ్, బోరెవెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మండల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కప్పాపహాడ్ రైతు యాదగిరి రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, ఉప్పరిగూడ సర్పంచ్ శ్రీవేణి, రైతులు పాల్గొన్నారు.






