19 June, 2026 | 2:45 AM

శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్ఠాపన

19-06-2026 01:16 AM

30 అడుగు హనుమాన్ విగ్రహం ఏర్పాటు

హుజూర్‌నగర్ బూరుగడ్డ గ్రామంలో భారీ ఎత్తున పాల్గొన్న భక్తులు

సూర్యాపేట్, జూన్ 18 (విజయక్రాంతి): 30 అడుగుల భారీ హనుమాన్ విగ్రహం, శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్ఠాపన మ హోత్సవం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ  గ్రామంలో గురువా రం ఘనంగా జరిగింది. చారిత్రాత్మక కాకతీయుల కాలం నాటి శ్రీ అనంత వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారు. యాగశాలలో వేద పండితులు రుత్వికులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, అగ్నిప్రతిష్ఠాపన వంటి వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

యజ్ఞం ముగింపు సందర్భంగా పూర్ణాహుతి, కలశ స్థాపన నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం బ్లాక్ కాంగ్రె స్ అధ్యక్షుడు దేశ్‌ముఖ్ అరుణ్ కుమార్, హుజూర్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక దేశ్‌ముఖ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించి, నేడు ముగింపు పలకనున్నారు. ఇప్పుడు వేణుగోపాలస్వామి దర్శనానికి వచ్చే భక్తులు, పర్యాటకులు భారీ ఆంజనేయ స్వామి, సీతారామలక్ష్మణుల విగ్రహాలను దర్శించుకోవచ్చు.