కాంగ్రెస్ అధ్యక్ష పదవి పూర్తిగా అంతర్గత విషయం
కాంగ్రెస్ యూత్ జిల్లా జనరల్ సెక్రటరీ గండ్ర శ్రీకాంత్ రావు
ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని, ఈ అంశాన్ని రాజకీయంగా ఎద్దేవా చేస్తే సహించబోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ జనరల్ సెక్రెటరీ గండ్ర శ్రీకాంత్ రావు హెచ్చరించారు. కొంతమంది పని గట్టుకుని సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఎన్నో అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు వేధింపులకు గురి చేసిందని గుర్తు చేశారు.
ఆవన్నీ తట్టుకొని ధర్మపురి నియోజకవర్గ చరిత్రలోనే అత్యంత భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ ను ఎమ్మెల్యే గా గెలిపించుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి విమర్శలు కొత్త కాదని,కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుందని హద్దు మీరితే ఊరుకోమని హెచ్చరించారు. వెల్గటూర్ మండల కాంగ్రెస్ లో వర్గాలు లేవని కొద్ది పాటి అలకలు ఏ పార్టీలో అయిన సాదారణమేనని తెలిపారు.అధ్యక్ష పదవి ఎవ్వరికి ఇచ్చిన కలిసి గట్టుగా పనిచేస్తామన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో జగిత్యాల జిల్లా లోనే వెల్గటూర్ మండల కాంగ్రెస్ శాఖను అత్యుత్తమంగా తీర్చి దిద్దుతామన్నరు.






